తెలుగు భాష గొప్పతనం గురించి సంప్రదాయ దుస్తులతో తెలిపిన సెయింట్ జేవియర్స్ విద్యార్థులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, August 30, 2022

తెలుగు భాష గొప్పతనం గురించి సంప్రదాయ దుస్తులతో తెలిపిన సెయింట్ జేవియర్స్ విద్యార్థులు

 తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం గురించి సంప్రదాయ దుస్తులతో తెలిపిన సెయింట్ జేవియర్స్ విద్యార్థులు


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఇందులో భాగంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో సంప్రదాయ అలంకరణలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు . అలాగే తెలుగు భాష దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, తెలుగు భాష ప్రాధాన్యతను తెలిపే పద్యాలు, గేయాలను ఆలపించారు. అలాగే విద్యార్థులచే  ఏకపాత్రాభినయంను అదేవిధంగా ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేర్లీ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad