ముక్కంటిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ మంత్రి బ్రాజేంద్ర ప్రతాప్ సింగ్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన మధ్యప్రదేశ్, లేబర్ అండ్ మినరల్ రిసోర్సెస్ మంత్రి బ్రాజేంద్ర ప్రతాప్ సింగ్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. తదనంతరం దక్షణామూర్తి సన్నిధి వద్ద శేష వస్త్రాలతో సత్కరించి వేదపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి స్వామి-అమ్మ వార్ల తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపట్టాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి A.C. మల్లిఖార్జున ప్రసాద్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment