విద్యార్థుల క్రమశిక్షణ వారి భావి భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని తెలిపిన సిఐ అంజూ యాదవ్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ స్కూల్ నందు ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ దేశభక్తి యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ అంజూ యాదవ్, ఎస్ఐ సంజీవ్ కుమార్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి మరియు పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.
సీఐ అంజు యాదవ్ మాట్లాడుతూ.... విద్యార్థి దశ చాలా అద్భుతంగా ఉంటుంది, దాన్ని ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందిస్తూ బావి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా మలుచుకోవాలని తెలిపారు. అలాగే విద్యార్థులు శారీరకదృఢత్వం, మానసిక ఉల్లాసం ఉంటే చదువు బాగా చదవచ్చని తెలిపారు. మనం ఎంత ఏదిగిన తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని తెలిపారు. అలాగే మీ అందరి సంరక్షణ మా బాధ్యత కావున మీరు జాగ్రత్తగా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాలని, మీకు ఏ సమస్య ఉన్న అధ్యాపకులకు తెలిపితే వారు మాకు తెలుపుతారని అన్నారు.
No comments:
Post a Comment