దేశభక్తి చాటేలా వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చిన న్యాయవాదులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని లోభావి లోని ఎస్టీ కాలనీ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నందు ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా రాబోయే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై విద్యార్థులకు మరియు ప్రజలకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయవాదులు రాజేశ్వరరావు,రమేష్ బాబు,అరుణ్, ప్రజ్ఞ శ్రీ, మరియు కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
న్యాయవాదులు మాట్లాడుతూ.... దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన దేశం (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి, జాతీయతా భావం ఒకటే. దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు. కావున
రాబోయే 75 స్వాతంత్ర దినోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క పౌరుడు ఆగస్ట్ 15 వ తేదీన వారి ఇంటి పైన రెపరెపలాడే జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటాలని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాన్ని ఈ సందర్భంగా నెమరవేసుకొనారు. అలాగే చిన్నపిల్లలకు, మహిళలకు ఉచిత న్యాయం అందిస్తారని అన్నారు. మీకు ఏ సమస్య ఉన్న 1 5 1 0 0 నెంబర్ కు కాల్ చేసి సలహాలు సూచనలు తెలుసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment