MGM రన్ శ్రీకాళహస్తి రన్ (3K రన్) విజయవంతం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, September 28, 2025

MGM రన్ శ్రీకాళహస్తి రన్ (3K రన్) విజయవంతం

 MGM రన్ శ్రీకాళహస్తి రన్ (3K రన్) విజయవంతం. 



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

సెప్టెంబర్ 29 వ తేదీ ప్రపంచ హృదయ దినోత్సవ సందర్బంగా ఆదివారం శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రన్ శ్రీకాళహస్తి రన్ (3K రన్) నిర్వహించారు. ఈ 3K రన్ లొ దాదాపు 600 మంది పైగా పాల్గొన్నారు. శ్రీకాళహస్తి RDO M.భాను ప్రకాష్ రెడ్డి గారు, మునిసిపల్ కమీషనర్  P. భవాని ప్రసాద్ గారు, MGM డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ గార్లు జండా ఊపి ప్రారంభించారు.. RDO గారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ప్రజల ఆరోగ్య దృష్ట్యా MGM హాస్పిటల్స్ వారు చేసిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరం అని తెలిపారు. కమీషనర్ గారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తూ ఈ 3కె రన్  లొ అందరిని భాగస్వాములను చేసిన  MGM యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపారు. MGM డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ  ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత  4సంవత్సరాలుగా  MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ  రన్ శ్రీకాళహస్తి రన్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి విచేసిన గౌరవ పెద్దలకు, పాల్గొన్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్బంగా MGM హాస్పిటల్స్  నందు గుండె సంబంధిత OP పూర్తి ఉచితం గా చూస్తారని అలాగే 28,29,30 తేదీలలో 50% రాయితీ తో ECG, 2D ECHO మరియు థ్రెడ్ మిల్ పరీక్షలు చేస్తారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని శ్రీకాళహస్తి ప్రజలు ప్రతీ రోజు ముందు జాగ్రత్త గా వ్యాయామం చేస్తూ  అందరు ఆరోగ్యంగా ఉండాలని ఈ రన్ శ్రీకాళహస్తి రన్ ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు.


No comments:

Post a Comment

Post Bottom Ad