కోర్టునే బురిడీ కొట్టించిన ఘనులు.. ఫేక్ జామీన్ పత్రాలతో ఎస్కేప్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, August 4, 2022

కోర్టునే బురిడీ కొట్టించిన ఘనులు.. ఫేక్ జామీన్ పత్రాలతో ఎస్కేప్

 కోర్టునే బురిడీ కొట్టించిన ఘనులు.. ఫేక్ జామీన్ పత్రాలతో ఎస్కేప్




జైలు నుంచి బయటకు వచ్చినవాళ్లు వాయిదాలకు కోర్టుకు హాజరుకాకపోవడంతో.. నేరుగా న్యాయస్థానం జామీనుదారులకు నోటీసులు పంపింది. వాళ్లు కూడా ఆ అడ్రస్‌లో లేకపోవడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకోగా.. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాయర్ అటెండర్ పరారీలో ఉన్నారని అతని కోసం గాలిస్తున్నట్లు తెనాలి పోలీసులు మీడియాకి తెలిపారు.


నకిలీ పత్రాలు, నకిలీ చిరునామాతో జైలులో ఉన్నవాళ్లకి జామీను


జైలు నుంచి బయటకు వచ్చాక వాయిదాలకు హాజరుకాని నిందితులు


కేసుతో సంబంధం ఉన్న నలుగురు అరెస్ట్.. మరొకరి కోసం గాలింపు


ఏపి క్రైమ్ న్యూస్


ఏదైనా కేసులో శిక్ష పడి జైలులో ఉన్న వ్యక్తులు బెయిల్ మీద బయటకు రావాలంటే సాధారణంగా ఎవరైనా జామీను ఇప్పించాలి. ఎవరో ఒకరు పూచీ కత్తుతో శిక్ష అనుభవిస్తున్న వాళ్లు బయటకు వచ్చి.. ఆ తర్వాత కోర్టులో వాయిదాలకు అటెండ్ అవుతుంటారు. అయితే, ఇలా బయటకు వచ్చినవాళ్లు వాయిదాలకు కోర్టుకు హాజరుకాకపోవడంతో.. నేరుగా న్యాయస్థానం జామీనుదారులకు నోటీసులు పంపింది. వాళ్లు కూడా ఆ అడ్రస్‌లో లేకపోవడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు


వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన భానుప్రకాశ్, తెనాలికి చెందిన భువనేశ్వర్ ఓ దారి దోపిడీ కేసులో 2019లో అరెస్టయ్యారు. ఆ తర్వాత సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో జామీను తీసుకుని బయటకు వచ్చారు. అప్పటి నుంచి కోర్టు వాయిదాలకు హాజరు కావాడం లేదు దాంతో న్యాయస్థాన సిబ్బంది జామీను ఇచ్చిన వారి అడ్రస్‌లకు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే.. అసలు వాళ్లు ఆ అడ్రస్‌లోనే లేరు.. ఆరా తీస్తే అది ఫేక్ అడ్రస్ అని తేలింది. దాంతో న్యాయస్థాన సిబ్బంది నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.


న్యాయస్థాన సిబ్బంది ఫిర్యాదు మేరకు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తీగ లాగగానే ఈ ఫేక్ డొంకంతా కదిలింది. భానుప్రకాశ్, భువనేశ్వర్ జైలులో ఉన్న సమయంలో వాళ్లిద్దరికీ జామీను కోసం కుటుంబ సభ్యులు నందివెలుగు గ్రామానికి చెందిన లాయర్ గుమస్తాను ఆశ్రయించారు. అతని ద్వారా గుంటూరుకు చెందిన జాషువా అనే వ్యక్తి నకిలీ జామీనుదారులను ఏర్పాటు చేయగా.. ఆ డాక్యుమెంట్స్‌ను గుంటూరులోనే కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ నడిపే భవానీశంకర్ సిద్ధం చేశాడు. దాంట్లో చిలకలూరిపేటకు చెందిన సురేష్, కోటేశ్వరమ్మ జామీనుదారులుగా వ్యవహరించారు. ఈ నలుగురిని అరెస్ట్ చేశామని.. లాయర్ అటెండర్ కోసం గాలిస్తున్నామని తెనాలి డీఎస్పీ స్రవంతిరాయ్ తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad