బంగారమ్మ జాతర సందర్భంగ సారెను సమర్పించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన పిచ్చాట్టూరు రోడ్డులో శ్రీ బంగారమ్మ కాలనీ లో వెలసిన శ్రీ బంగారమ్మ జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం అధికారులు ఆధ్వర్యంలో శ్రీ బంగారమ్మ తల్లికి సారెను సమర్పించడం జరిగింది. ముందుగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పట్టు వస్త్రాలు శిరస్సుపై ఉంచుకొని ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలోని శ్రీ బంగారమ్మ తల్లికి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు సమర్పించారు.శ్రీ బంగారమ్మ తల్లికి దేవస్థానం అర్చకులు వెద పండితులు విశేష పూజలు జరిపి పట్టు వస్త్రాలను శ్రీ బంగారమ్మ తల్లి అమ్మవార్లకు అలంకరించి విశేష పూజలు జరిపారు.ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కొండూరు సునీత, లక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితో సభ్యులు చింతామణి పాండు, ఆలయ అధికారులు ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈ వేణుగోపాల్ రెడ్డి , సబ్ టెంపుల్స్ ఇంచార్జ్ లక్ష్మయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ దేవస్థాన సిబ్బంది సుదర్శన్ రెడ్డి, మునిరాజా, దాము, పసుపులేటి కామేశ్వరరావు. పట్టణ ప్రముఖులు కొండూరు నంద, భాస్కర్ ముదిరాజ్, పాలమంగళం రవి, లక్ష్మీపతి, భాస్కర్ రెడ్డి, రమణయ్య నాయుడు, సుధాకర్ రెడ్డి, జగన్నాథం నాయుడు, రాజగోపాల్ రెడ్డి, మునిరాజు నాయుడు,కప్ప రామాంజనేయులు, ఆలయ పూజారి శ్రీనివాసులు మరియు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment