జాతీయ స్థాయిలో పెద్ద కన్నలి, అన్నసామిపల్లి కుర్రోళ్ళు ప్రభంజనం జాతీయ ఫ్లోర్ కర్లింగ్ పోటీలలో గోల్డ్, సిల్వర్ మెడల్స్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పేరూరు మునిరెడ్డి తనయుడు హర్షవర్ధన్, పెద్ద కన్నలి భాస్కర్ రెడ్డి తనయుడుజవహర్ సాయిరాం ప్రతిభ
తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జవహర్ సాయిరాం రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఇద్దరూ
అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటా నగర్ లో ఈనెల 21వ తేదీన జరిగిన జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండవ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ షిప్ 2023 పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్న మన రేణిగుంట అన్నసామిపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాది కుమారుడు పేరూరు మునిరెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి గ్రామానికి చెందిన కన్నలి విజయభాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కన్నలి మల్లికమ్మల తనయుడు జవహర్ సాయిరాం రెడ్డిగోల్డ్, సిల్వర్ మెడల్స్ ను సాధించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పెమ కందు నాబం రెబియా, రాజ్యసభ ఎంపీ యోగేశ్వర్ దత్త చేతులు మీదుగా మెడల్స్ అందుకున్నారు. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ మొదటి బహుమతి, అరుణాచల్ ప్రదేశ్ రెండవ బహుమతి, హర్యానా మూడవ బహుమతులను కైవసం చేసుకున్నాయి. తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరికీ మెడల్స్ రావడంతో తమతో చదువుతున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేశారు.
No comments:
Post a Comment