శాంతారాం రామ్ జె.పవార్ గారి నాల్గవ వర్ధంతి సభలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పురపాలక సంఘం, ఆలయ ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ స్వర్గీయ శాంతారాం రామ్ జె.పవార్ నాల్గవ వర్ధంతి కార్యక్రమాన్ని సరస్వతి శిశు మందిర్ లో ఆదివారం రైతు సేవా సమితి నాయకుడు మోహన్ రావు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై శాంతారాం రామ్ జె.పవార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీ కి మారు పేరుగా ఆలయ, మునిసిపల్ చైర్మన్ పదవులకు వన్నె తెచ్చిన ప్రజా నాయకుడు అని అన్నారు. అవినీతి రహిత పాలనను సాగించిన ఆయనను ఈ తరం నాయకులు ఆదర్శంగా తీసుకోనీ సమాజ సేవకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు,పి.వి.ఆర్. గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ రావు వి.పవార్, ముకుంద రావు జె.పవార్, జనార్దన్ రావు జె పవార్, రాజారాం వి.పవార్, పి. మహేశ్వర రావు, జూలుగంటి గోపి, జి.వి. రమణమూర్తి,లక్ష్మయ్య, మహబూబ్ బాషా, కన్నలి విజయకుమార్ రెడ్డి, పూల కృష్ణమూర్తి, టైలర్ రాము, సత్యనారాయణ, హెచ్.బాబు, ధన, యోగ, మోహన్, ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment