రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 136 సీట్లతో ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ:డాక్టర్ ఎస్. బతైయి నాయుడు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
కర్ణాటకలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 136 సీట్లతో ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. దానిద్వారా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి విజయోత్సవాలు చేసుకున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో డాక్టర్ ఎస్. బతైయి నాయుడు నాయకత్వంలో నాయకులు కార్యకర్తలతో కలిసి నాలుగు మాడ వీధులలో విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాబోయే రోజులలో రాహుల్ గాంధీ నాయకత్వంలోనే అన్ని రాష్ట్రాలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికలలో ఘనవిజయం సాధించి పెట్టాలని మోదీ గారికి తగు గుణపాఠం చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో; ఎస్.కె.జానీ భాష, బి.విజయ్ శేఖర్, టి .శివయ్య, ఈ. గోపి, రాఘవరెడ్డి, నాగూర్ అయ్యా, శెట్టిపల్లి. శివయ్య, మోహన, వానమ్మ, మస్తానమ్మ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment