"తెలుగు తమ్ముళ్ల వినూత్న నిరసన" ఇంటి అవసరాలకు ఉపయోగించే విద్యుత్ పరికరాలను చేతబట్టి, పాత సామాన్లు కొనుగోలు చేసే విక్రయ దుకాణదారుడుకి అమ్మి తమ నిరసన తెలియజేయడం జరిగింది
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారి సూచనల మేరకు ,శ్రీకాళహస్తి నియోజవర్గ ఇన్చార్జ్బొ జ్జల వెంకట సుధీర్ రెడ్డి దిశ నిర్దేశంతో.....,
శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు ,పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ గార్ల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని శ్రీకాళహస్తి పట్టణం లోని సబ్ స్టేషన్ వద్ద నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ, వినూత్నంగా ఇంటి అవసరాల నిమిత్తం ఉపయోగించే విద్యుత్తు పరికరాలను చేతబట్టి ఈ YCP ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా..., YCP డౌన్, డౌన్, అంటూ, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేసుకుంటూ, విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ...,పాత సామాన్ల విక్రయ దుకాణం వద్దకు వచ్చి...., పాత సామాన్ల విక్రయ దుకాణ యజమానికి తమ నిరసన వ్యక్తపరుస్తూ, విక్రయించడం జరిగింది, రాబోవు రోజుల్లో ఈ పరికరాలకు స్వస్తి పలికే దిశగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొస్తారు అని తెలియజేస్తూ విద్యుత్ పరికరాలను దుకాణదారుడికి అమ్మి, దుకాణదారుడు వద్ద నుంచి పైకం తీసుకోవడం జరిగింది, అనంతరం సబ్ స్టేషన్ AD గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ...., ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదలు నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో రాష్ట్ర ప్రజలపై పెనుబారం మోపుతూ విద్యుత్ చార్జీలు 8 సార్లు పెంచిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి దక్కిందని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలపై ఆరువేల కోట్ల రూపాయలు పెను భారం మోపే దిశగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఆనాడు ఓదార్పు యాత్రలో భాగంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఊరు వాడ 200 యూనిట్లు లోబడి ఉంటే ఉచిత విద్యుత్తు ఇస్తానన్న పెద్దమనిషి ఈ రోజు ఉచిత విద్యుత్తుకు తూట్లు పొడుస్తూ...,రాష్ట్ర ప్రజల పై పేను భారం మోపే దిశగా విద్యుత్ చార్జీలు పెంచుకుంటూ రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితి గతులను పాతాళానికి నెట్టే దిశగా తీసుకుపోవడం చాలా బాధాకరం అని అభివర్ణించడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి పూడి దసరధాచారి,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మినరల్ రవి, తిరుపతి జిల్లా పార్లమెంటరీ కోశాధికారి కంటా రమేష్, తెలుగు నాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఉమేష్ రావు మోరే, తిరుపతి జిల్లా పార్లమెంటరీ రైతు ఉపాధ్యక్షులు ప్రకాష్ నాయుడు, వాకచర్ల గుర్రప్ప శెట్టి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు చక్రాల ఉష,వజ్రం కిషోర్, పోలూరు శ్రీనివాసులరెడ్డి ,గాధిపాకుల గోపి, KV ప్రతాప్,గుత్తా విజయ్ కుమార్, కుమారి,కిట్టు,శ్రీలక్ష్మి, చంద్రకళ ,నెమల్లూరు బుజ్జి ,ఆర్ముగం,జిలాని, DV నారాయణ, ఖాదర్ బాష,బషీర్, అస్మత్, షఫీ, భాస్కర్ గౌడ్, యాదగిరి,సన్నీ కయ్యూరి దిలీప్,దోరబాబు,సాయి నాయుడు, మురళి, ధనంజయ నాయుడు సురేష్,ముని రాజమ్మ, సులేమ, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment