వితరణలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే.... తగ్గేదే లే
•నిరుపేద విద్యార్థికి డెల్ లాప్టాప్ కొనిచ్చి...
•స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తి...
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, చియ్యవరం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి కార్తీక్ గూడూరు ఆదిశంకర కాలేజీలో డిప్లమా CME ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.తనకి లాప్ టాప్ అవసరం అవడంతో వారి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉండడం వలన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గారిని కలిసి తన చదువుల నిమిత్తం లాప్ టాప్ అవసరమని తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వెంటనే కొత్త డెల్ లాప్ టాప్ కొనిచ్చి బాగా చదువుకొని మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు పార్టీ అధ్యక్షులు ఉన్నం వాసు నాయుడు, కొన్నలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment