చిన్నారి మెరుగైన ఆరోగ్యం కొరకు ఎమ్మెల్యే సహాయం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, May 28, 2023

చిన్నారి మెరుగైన ఆరోగ్యం కొరకు ఎమ్మెల్యే సహాయం

 చిన్నారి మెరుగైన ఆరోగ్యం కొరకు ఎమ్మెల్యే సహాయం


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి మండలం,పుల్లారెడ్డి కండ్రిగ SC కాలనీకి చెందిన రేష్మ (12) పెరాలసిస్ వల్ల అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నారు. మెరుగైన వైద్యం కొరకు హైదరాబాదులోని మేఘన న్యూరాలజీ హాస్పిటల్లో చేరాలని దానికి వారి ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఈ రోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని కలిసి వారి సమస్యను విన్నవించుకున్నారు. తక్షణమే ఎమ్మెల్యే  స్పందించి చిన్నారి వైద్యం కొరకు ₹ 20,000/- ఆర్థిక సహాయం అందజేసి ఇంకా వారికి ఏమి సాయం కావాలన్నా తనకు నేరుగా ఫోన్ చేయాలని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో రత్నం రెడ్డి, ప్రొఫెసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad