కైలాసదన్ అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చిన్నపిల్లల పార్కు ఏర్పాటు పనులను పరిశీలించిన పాలకమండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అతిథి గృహంలో గంగా సదన్ మరియు కైలాస సదన్ లో చిన్నపిల్లల ఆట స్థలాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పనులను పరిశీలించి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు తగు సూచనలు ఆదేశించారు.
ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ భరద్వాజ తీర్థంలో నూతనంగా ప్రారంభించిన కైలాస సదన్ అతిధి గృహంలో నూతనంగా ఏర్పాటుచేసిన చిన్నపిల్లల పార్కును పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కొంత పనులను కూడా పూర్తి కావాల్సింది అది త్వరలో పూర్తిచేసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణం మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన భక్తులకు కూడా చిన్నపిల్లలతో పచ్చని చెట్లు మధ్యలో ఆహ్లాదకర వాతావరణంలో చిన్నపిల్లలు ఆటాడుకునే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాసులు రెడ్డి, ఏఈ రాజేశ్వరి, మరియు పట్టణ ప్రముఖులు స్వర్ణ మూర్తి, బాలశెట్టి నరసింహులు, మరియు కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment