ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు శ్రీకాళహస్తి లో ఘనంగా జరిగాయి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో ఊరందుర్ లో బొజ్జల బృందమ్మ గారిని ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు
భరద్వాజ తీర్థంలో గల వృద్ధుల ఆశ్రమంలో తల్లులకు చీరలు పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు అందించి వారి ఆశీస్సులు తీసుకున్నారు
శివనాద పురం లో అమ్మ ఆశ్రమం నిర్వహిస్తున్న భూలక్ష్మి, సరస్వతమ్మ సరోజమ్మ అమ్మలకీ ఘనంగా సత్కరించి ఆశ్రమం లో ఉంటున్న అమ్మలకు చీరలు పండ్లు బిస్కెట్ లు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకున్నారు
ఈ సందర్బంగా చక్రాల ఉష మాట్లాడుతూ
అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలీదుగానీ.. ‘అమ్మ’ మాత్రం, తన ఆయుష్సును సైతం బిడ్డకే అందిస్తుంది.
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవ మాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటిపాపలా చూసుకుంటుంది. ప్రసవ సమయంలో నరకాన్ని అనుభిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. జీవితాంతం.. తమ పిల్లలే లోకంగా జీవించే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమే. కానీ, ఒకటి మాత్రం చాలా సులభం. అదే ప్రేమ! ఆమె మనకు అందించే ప్రేమలో కొంచెం తిరిగిచ్చినా చాలు.. ఆ తల్లి గుండె సంతోషంతో నిండిపోతుంది. చిన్న పలకరింపు.. ఆప్యాయమైన మాటలు.. ఆమెలో ధైర్యాన్ని నింపుతాయి. ఈ మాతృదినోత్సవం రోజున ఆ త్యాగమూర్తిని సంతోషపెట్టే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. త్యాగమూ, ప్రేమా కలిస్తేనే అమ్మా. అమ్మకు మరో ప్రత్యామ్నాయం లేదు. బిడ్డ కడుపులో పడినప్పటి నుండి ఆ తల్లీ చనిపోయే వరకూ ఆ బిడ్డల కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తుంది అటువంటి తల్లులు ఇప్పటి బిడ్డలకు బరువవుతూ ఆశ్రమల్లో పెట్టడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తo చేశారు
ఈ కార్యక్రమం లో C M విజయ, శ్రీలక్ష్మి,ఊహ, జయశ్రీ, సుభాషిణి, మహేష్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment