నన్ను నువ్వు పోషించు నేను నిన్ను రక్షిస్తాను :యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 23, 2023

నన్ను నువ్వు పోషించు నేను నిన్ను రక్షిస్తాను :యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్

 నన్ను నువ్వు పోషించు నేను నిన్ను రక్షిస్తాను అందరూ మొక్కలు నాటండి మాతో బాగస్వాములం కండి యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్





   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 ఏర్పేడు మండలం అముడూరు పంచాయతీ, బండివాని పల్లే గ్రామం నందు యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షులు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు, వ్యవస్థాపకులు డాక్టర్ గానుగపెంట రమేష్ ల ఆధ్వర్యంలో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం సంయుక్తంగా విద్యార్థిని విద్యార్థులంతా కలిసి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ లో బాగంగా ప్రాణవాయువు నిచ్చే చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, విద్యార్థులు మాట్లాడుతూ పిల్లలకు అర్థమయ్యేలా మనం ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడ నుండి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తారు అని చెప్పకుండా మనం ఒక మొక్క నాటితేనే ఒక వర్షం చుక్క మనకు పడుతుంది అని చెప్పడంతో పాటు పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని ప్రతీ ఒక్కరికీ తెలియపరచడం మన బాధ్యత అని తెలిపారు. అలాగే ఎవరైనా స్వచ్ఛందంగా  ముందుకు వచ్చే దాతలు సంస్థకు సహకరించవలసిందిగా సంస్థ ప్రతినిధులు కోరారు అలాగే జూన్ 5న ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆరోజు నాటికి 2000 మొక్కలకు పైగా ప్రతిరోజూ సంస్థ సభ్యులు మరియు వేము కళాశాల విద్యార్థిని విద్యార్ధులు పాల్గోని జయప్రదం చేస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు శ్రీమతి ,ముని రాజా ,రంజిత్, నందు ,శశిధర్, కార్తీక్  మరియు చిన్నపిల్లలు ఇతర సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మెకానికల్ విభాగ హెడ్ రావు వారికి, కోఆర్డినేటర్ హేమ మహేష్ వారికి, కళాశాల  ప్రిన్సిపల్ నవీన్ కిలారి వారికి చైర్మన్ కె చంద్ర శేఖర్ నాయుడు వారికి, సంస్థ ప్రతినిధులు విద్యార్థిని తల్లిదండ్రులు, ధన్యవాదాలు తెలియజేశారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad