శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం విచ్చేసి భక్తులకు ట్రాఫిక్ అంతరం లేకుండా 50 అడుగుల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన దేవస్థానం చైర్మన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానకు నిత్యం లక్షలాది మంది భక్తులు విచ్చేసిన సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా దిగువ సన్నిధి వీధి వద్ద 50 అడుగుల రోడ్డుని నిర్మాణం కోసం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఇంజనీరింగ్ శాఖ సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించినారు. అనంతరం అక్కడ అక్రమంగా ముందుకొచ్చిన షాపుని ఇంజనీరింగ్ శాఖ అధికారులు కొలతలు వేసి మార్కింగ్ ఏర్పాటు చేశారు. పాలకమండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కు అనునిత్యం దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు వీరికి సౌకర్యం కోసం దేవస్థానం దిగు సన్నిధి వద్ద 50 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం ప్రారంభం చేస్తున్నారని తెలియజేశారు. ఇక్కడ దుకాణదారులు అక్రమంగా ముందుకు వచ్చివారిని సోమవారం వరకు గడువు దేవస్థానం ఇచ్చిందని తెలిపారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలను కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి స్తంభాన్ని కూడా తొలగించి వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం సోమవారం నాడు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు సాధనమున్న, దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఈఈ మురళీధర్ రెడ్డి, డిఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ కిషోర్ కుమార్, వర్కిఇన్స్పెక్టర్ ప్రతాప్, మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment