యువనేస్తం అసోసియేషన్ 3 వ వార్షికోత్సవ సందర్బంగా పిల్లలకు క్రీడా పోటీలు: అధ్యక్షులు మునిశేఖర్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలంలోని చిందేపల్లి ఎస్టీ కాలనీ మరియు నచ్చనేరి ఎస్టీ కాలనీ పిల్లలకు ఏర్పేడు మండల కో ఆర్డినేటర్ అరుణ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మధురాంతకం ముని శేఖర్ తెలియచేసారు. ఈ సందర్బంగా ముని శేఖర్ మాట్లాడుతూ యువనేస్తం అసోసియేషన్ 3వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చిందేపల్లి ఎస్టీ కాలనీ మరియు నచ్చనేరి ఎస్టీ కాలనీ పిల్లలకు పరుగు పందెం మరియు మ్యూజికల్ చైర్స్,లెమన్ అండ్ స్పూన్ క్రీడలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గిరిజన పిల్లలు చదులోనే కాదు క్రీడా రంగంలో కూడా ముందుండాలి అని గిరిజన పిల్లల ఎదుగుదల కోసం యువనేస్తం అసోసియేషన్ ఎల్లప్పుడూ తోడు ఉంటుందని తెలిపారు. గిరిజనుల అభివృద్ది కోసం ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వాలంటీర్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment