పచ్చని చెట్లు ప్రగతికి మేట్లు..యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పెనుమూరు మండలం, కే సి పల్లి గ్రామం,చిత్తూరు జిల్లా మరియు పాత శానం బట్ల గ్రామం చంద్రగిరి మండలము తిరుపతి జిల్లా మరియు హరేకృష్ణ రోడ్ తిరుపతి నందు మూడు ప్రదేశాలలో యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థ సంయుక్తంగా విద్యార్థిని విద్యార్థులతో కలిసి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ Save Trees-Save Environment ఐదవ రోజు లో బాగంగా ప్రాణవాయువు నిచ్చే చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, విద్యార్థులు పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత ఒక చిన్న మొక్క నాటి నేలమ్మ ఆయుష్షును కాపాడి కొంచమైనా రుణం తీర్చుకుందాం అని తెలిపారు. అలాగే జూన్ 5న ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆరోజు నాటికి 2000 మొక్కలకు పైగా ప్రతిరోజూ సంస్థ సభ్యులు మరియు వేము కళాశాల విద్యార్థిని విద్యార్ధులు నాటి జయప్రదం చేస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు మాధవ్, సుకేష్ భరత్, సుదర్శన్ , పార్థ సారథి శివ ధనుష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యాజమాన్యానికి సేవా సంస్థ సభ్యులకు విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సేవా సంస్థ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు
No comments:
Post a Comment