శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ నందు అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
కేవీబీ పురం మండలం పవనవారికండ్రిగ కు చెందిన 60 సంవత్సరముల వ్యక్తి గతంలో TB వ్యాధితో బాధపడి మందులు వాడుతూ 6 నెలలుగా కడుపులో (మాషివ్ ప్లినో మెగావే) ప్లేహము సంబంధించిన గడ్డ తో బాధపడుతూ శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ నందు డాక్టర్స్ ని సంప్రదించగా హాస్పిటల్ నందు జనరల్ లాపరోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ డాక్టర్ చావలి శివ కిషోర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పలు వైద్య పరీక్షలు చేసి రక్తం తక్కువగా వున్నను కొత్తగా రక్తం ఎక్కించి ఆపరేషన్ కి సంబంధించిన 3 రకాల వాక్సిన్ లు వేసి అపరేషన్ కి సిద్దపరిచారు. ఆపరేషన్ థియేటర్ నందు డాక్టర్ వివేక్ చైతన్య గారి పర్యవేక్షణలో అనస్తిషియా డాక్టర్ లాస్య డాక్టర్ చావలి శివ కిషోర్ దాదాపు 2 గంటలు శ్రమించి 25*15*10 సెంటిమీటర్ సైజు గల 2 కేజీ బరువు గల ప్లేహము ను కడుపు నుండి తొలగించడం జరిగింది. దాదాపు 5 రోజులు ICU నందు ఉంచి పేషేంటు ను పూర్తి ఆరోగ్యవంతునిగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. పేషంట్ వారి బంధువులు మాట్లాడుతూ MGM హాస్పిటల్ కి ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి చుట్టు ప్రక్క గ్రామాల ఆరోగ్య శ్రేయస్సు కోరి మేము స్థాపించిన MGM హాస్పిటల్ నందు ఆరోగ్య శ్రీ ద్వారా 24 గంటలు అన్ని రకాల వైద్య సేవలు మరియు శస్త్ర చికిత్సలు పూర్తిగా ఉచితంగా చేస్తారని తెలిపారు. ఎంతో శ్రమించి ఆపరేషన్ ను విజయవంతం చేసిన వైద్య సిబ్బందిని అభినందించారు.
No comments:
Post a Comment