యువనేస్తం అసోసియేషన్ వారు చేస్తున్న సేవలు అభినందనీయం : వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీ మదురెడ్డి.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
యువనేస్తం అసోసియేషన్ 3 వ వార్షికోస్తవంలో భాగంగా శ్రీకాళహస్తి లోని వ్యవసాయ కమిటి చైర్మన్ అయినటువంటి మధు రెడ్డి గారితో యువ నేస్తం అసోసియేషన్ సభ్యులు కలవడం జరిగిందని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మధురాంతకం మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మదురెడ్డి మాట్లాడుతూ యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మునిశేఖర్ మరియు వారి టీమ్ నిరుపేదవారికి ఎన్నో రకాలుగా ఉపయేగపడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను మేము ప్రతీ రోజు చూస్తున్నామని తెలిజేశారు. ఎక్కువగా పేదవారికి ,అలాగే గిరిజన కాలనీలలో విద్యాభివృద్ధికి మరియు ప్రమాదంలో గాయపడిన పేద వారికి వారు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.ఈ సందర్భంగా మునిశేఖర్ మాట్లాడుతూ సంస్థ 3 వ వార్షికోత్సవం సందర్భంగా, సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు యువనేస్తం అసోసియేషన్ చేసిన కార్యక్రమాలతో కూడిన కరదీపికను వ్యవసాయ కమిటి చైర్మన్ మదురెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది లక్మి పతిరెడ్డి, శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మునికృష్ణా రెడ్డి,సుధాకర్ మరియు యువ నేస్తం అసోసియేషన్ ఉపాధ్యక్షులు హనుమంత్ నాయక్ యువనేస్తం వాలంట్రీలు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment