శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదాలు తయారు చేసే పోటును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు కోసం తయారు చేసే లడ్డు పోటును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజు తారక శ్రీనివాసులు అక్కడ లడ్డు యొక్క కొలతలను పూర్తిగా పరిశీలించి కొలతలన్నీ సరైన పద్ధతిలో ఉన్నాయని గుర్తించినారు. ప్రసాదాలు యొక్క నాణ్యతను స్వయంగా రుచి చూసి నాణ్యత పరిమాణాలు చాలా అద్భుతంగా ఉందని తెలియజేశారు. చేసే ప్రసాదాలు తయారు చేసే సిబ్బందిని అభినందించారు. అదేవిధంగా సిబ్బంది యొక్క జీతాలును పెంచాలని చైర్మన్ గారి దృష్టికి తీసుకువచ్చారు రాబోయే పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ గారు హామీ ఇచ్చినారు. చైర్మన్ గారు మాట్లాడుతూ దైవ సంకల్పంతో ఈ యొక్క పనిని భగవంతుడు పనిగా భావించి ప్రసాదాలను ఎక్కడ కూడా నాణ్యత పరిమాణంతో తగ్గకుండా చూడాలని తెలియజేశారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది తెలియజేసినారు. అనంతరం పి ఆర్ ఓ సిబ్బంది, పాలకమండ సభ్యులు సిబ్బంది తీసుకొచ్చే ఇండెంట్ బుకను ప్రశ్నించినారు. ఈ కార్యక్రమంలో పోటు సిబ్బంది విశ్వనాథం, చైర్మన్ పిఎ పసుపులేటి కామేశ్వరరావు, మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment