బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, May 15, 2023

బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు

 శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దేవస్థానం  చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు




   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన పుష్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున వేద పండితుల ఆశీర్వచనం ను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఇప్పించారు. స్థానిక బేరి వారి మండపం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో భాగంగా తొలుత శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సారధ్యంలో వేద పండితులు అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వరుని ఆశీర్వాదంతో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరింత ఉన్నతంగా ప్రజా సేవలో రాణించాలని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆకాంక్షిస్తూ... ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు సాధన మున్నా,బుల్లెట్ జయశ్యామ్, పంతులు, పసల సుమతి, కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు చింతామణి పాండు, పాలమంగళం నీలా, శ్రీదేవి, శోభ, దేవస్థానం  అధికారులు ఏఈఓ సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సుదర్శన్ నాయుడు, వెంకట ముని, దేవస్థాన ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, పురోహితులు అర్ధగిరి స్వామి, వేద పండితులు అవినాష్ శర్మ , శివకుమార్ శర్మ, హేమంత్ కృష్ణమాచార్యులు వైయస్సార్సీపీ నాయకులు లోకేష్ యాదవ్, కొండూరు నంద, భాస్కర్ ముదిరాజ్, పాలమంగళం రవి, వెంకటసుబ్బయ్య, శ్రీవారి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad