కలవగుంట భరత్ రెడ్డిచే క్రికెట్ కిట్లు పంపిణీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవగుంట భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగ గిరిజనకాలనీకి చెందిన యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలవగుంట భరత్ రెడ్డి మాట్లాడుతూ... యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తాను ఈ క్రికెట్ కిట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. యువత వేసవి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో ప్రావీణ్యం పొందాలనే ఉద్దేశంతో తొట్టంబేడు మండలంలోని ప్రతి గ్రామంలో యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి యువసేన సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment