విజయం సాధించిన క్రీడాకారులకు సన్మానం చేసి అభినందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, May 10, 2023

విజయం సాధించిన క్రీడాకారులకు సన్మానం చేసి అభినందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే.

 "AP CM CUP" స్టేట్ లెవెల్ టోర్నమెంట్ - 2023 విజయం సాధించిన క్రీడాకారులకు సన్మానం చేసి అభినందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే.






   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  "AP CM CUP" స్టేట్ లెవెల్ టోర్నమెంట్ - 2023 లో విజయం సాధించిన క్రీడాకారులకు సన్మానం చేసి అభినందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే.


తిరుపతిలో జరిగిన "AP CM CUP" స్టేట్ లెవెల్ టోర్నమెంట్ - 2023లో శ్రీకాళహస్తి పట్టణం జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన బి.కరుణా కుమార్ టెన్నిస్ లో సిల్వర్ మెడల్ సాధించారు అలాగే టేబుల్ టెన్నిస్ విభాగంలో ఆర్.ఝాన్సీ,టీ.పూజిత బ్రొంజ్ మెడల్ సాధించారు.


ఈ సందర్భంగా ఈరోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్రీడాకారులను వారి కుటుంబ సభ్యులను అలాగే పి.డి. వెంకట ముని గారిని సన్మానించి భవిష్యత్తులో క్రీడల్లో బాగా రాణిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదిగి శ్రీకాళహస్తికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో దేవస్ధానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, బియ్యపు శ్రీ పవిత్ర రెడ్డి,zp బాయ్స్ స్కూల్ కమిటీ చైర్మన్ ఆర్కడ్ శంకర్,చిట్టి వేలు జయగోపాల్, ఎత్తి రాజులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad