చిన్నపిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు :అధ్యక్షులు మునిశేఖర్.
స్వర్ణముఖిన్యూస్ ,ఏర్పేడు :
యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం నచ్ఛనేరి ఎస్టీ కాలనీ,ముసిలిపపేడు ఎస్టీ కాలనీ లో ఉన్న పిల్లలు,పిల్లల తల్లిదండ్రులతో యువనేస్తం అసోసియేషన్ మండల కో ఆర్డినేటర్ అరుణ మరియు యువనేస్తం వాలంట్రీలు సమావేశం అవడం జరిగిందని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మధురాంతకం మునిశేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా మునిశేఖర్ మాట్లాడుతూ గిరిజనులు అభివృద్ధి కోసం మన యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు, గిరిజన పిల్లల చదువు కోసం సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.ఎస్టీ కాలనీ లో ఉన్న పెద్దలు మరియు పిల్లల తల్లిదండ్రులు పిల్లలను ప్రతీ రోజు పాఠశాలకు పంపించాలని తెలిపారు.చిన్నపిల్లలు బడిపిల్లలు మాత్రమే అని పనిపిల్లలు కాదు అని తెలిపారు. పిల్లలు బాగా చదువుకుంటేనే ఎస్టీ కాలనీలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అందులో భాగంగానే ఎస్టీ కాలనీ లో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి పిల్లలను చదివించాలని పెద్ద వారితో యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో అరుణ మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనేస్తం అసోసియేషన్ శ్రీకాళహస్తి మండల కో ఆర్డినేటర్ నాగమణి మరియు యువనేస్తం అసోసియేషన్ వాలంట్రీలు లక్ష్మీ, స్రవంతి, స్వాతి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment