సిటిజన్స్ వెల్ఫేర ఫోరం ప్రైడ్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ మరియు త్రినేత్రం నృత్యం నీరాజనం ఆధ్వర్యంలో అవార్డులు అందుకున్న మాజీ శాసనసభ్యులు పాలకమండలి చైర్మన్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
సిటిజన్స్ వెల్ఫేర ఫోరం ప్రైడ్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ మరియు త్రినేత్రం నృత్యం నీరాజనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు గారికి ఆయన చేసిన సేవ కార్యక్రమం గుర్తించి వివేకానంద మరియు అనునిత్యం భగవంతుని సేవా కార్యక్రమంలు పాల్గొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు అంజు తారక శ్రీనివాసులు గారికి శ్రీ శ్రీకృష్ణదేవరాయ అవార్డును అందజేశారు. పాలకమండలి చైర్మన్ మాట్లాడుతూ యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్క చిన్న బిడ్డ ఆరు నెలలు పూర్తికాకుండా ఏడుస్తా ఉంటే అమ్మ లాలిపాట మర్చిపోయి సెల్ ఫోన్లు పాటలు ఆన్ చేసి వినిపించే దృష్టికి వచ్చింది అని తెలియజేశారు అటువంటి ఈ పరిస్థితుల్లో మీ యొక్క చిన్నారులను ఇంత చక్కగా భారతి సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోలన్న ఆలోచనతో పిల్లలను ఇంత దూరం తీసుకొచ్చి ఈ యొక్క సంస్కృత కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మీ చిన్నారి అందరికీ శ్రీ తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో సిటిజన్స్ వెల్ఫేర ఫోరం ప్రైడ్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ సభ్యులు మరియు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment