థాంక్యూ భరత్ అన్న: పూడి గ్రామ యువత - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, May 17, 2023

థాంక్యూ భరత్ అన్న: పూడి గ్రామ యువత

 థాంక్యూ భరత్ అన్న: పూడి గ్రామ యువత 


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవగుంట భరత్ రెడ్డి ఆధ్వర్యంలో  మంగళవారం తొట్టంబేడు మండలం పూడి గ్రామంలోని బి.సి కాలనీ యువతకు ,అరుంధతి వాడకు చెందిన యువతకు క్రికెట్ కిట్లు,వాలీ బాల్ కిట్లు,గ్రౌండ్ నెట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ యువత మాట్లాడుతూ క్రికెట్, వాలీ బాల్ కిట్లను గత రెండు సంత్సరాలుగా అందిస్తున్నాడని భరత్ రెడ్డి ని థాంక్యూ భరత్ అన్న ,థాంక్యూ భరత్ అన్న అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా భరత్ రెడ్డీ మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తాను ఈ క్రికెట్ కిట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. యువత వేసవి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.బావిలు,కాలువలు అంటూ ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.తొట్టంబేడు మండలంలోని ప్రతి గ్రామంలో యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరుపేదలకు పుస్తక సామాగ్రిని, పరీక్షా సమయాల్లో పరీక్షా సామాగ్రిని అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad