మహిళా మల్లయోధుల పోరాటానికి మద్దతుగా ఇఫ్టూ,పిడిఎస్యూ ర్యాలీ, ధర్నా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తమపై జరిగిన లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా మల్ల యోధులు ఢిల్లీలో సాగిస్తున్న ఆందోళనకు సంఘీభావంగా ఈరోజు శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఐ.ఎఫ్.టియు. ఏఐకేఎంఎస్ ,పిడిఎస్యూ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.మహిళా రెజ్లర్స్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన బి.జె.పి. ఎం.పి. బ్రిజ్ భూషణ్ ను తక్షణం అరెస్టు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలనీ, మోడీ -షా ల మహిళా వ్యతిరేక విధానాలు నశించాలని, పని స్ధలాలలో మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈసందర్భంగా ఐ.ఎఫ్.టి.యు.రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ హరికృష్ణ ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు రామిశెట్టి వెంకయ్య ఏఐకేఎంఎస్ గౌరవ అధ్యక్షులు వెంకటరత్నం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి భారతి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం ఐఎఫ్టియు జిల్లా కమిటీ మెంబర్ పి శోభ మాట్లాడుతూ "బేఠీ బచావో- బేఠీ పడావో"అని పిలుపు నిచ్చే ప్రధాని మోడీకి ఢిల్లీలో మహిళా మల్లయోధులు చేస్తున్న పోరాటం కనిపించలేదా? అని ప్రశ్నించారు.ప్రపంచ క్రీడల్లో బంగారు, వెండి,రజిత,కాంస్య పతకాలు సాధించి భూగోళ మంతా భారతదేశం ప్రతిష్టను ఇనుమడింప చేసిన మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించిన వ్యక్తులను మోడీ -షా ల ప్రభుత్వం కాపడటాన్ని తీవ్రంగా ఖండించారు.అత్యున్నత స్థాయి క్రీడాకారులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.పని స్థలాల్లో మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.మహిళా మల్ల యోధుల డిమాండ్లను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దోషులను అరెస్టు చేయించాలని కోరారు. ఎం.పి.బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇఫ్టూ నాయకులు ప్రమీల కల్పన శాంతి కుమారి జహీరా కౌసల్య మన్నెమ్మ కృష్ణవేణి మోహన్ రాణి, దేవి కుమార్, కృష్ణవేణి ఏఐకేఎంఎస్ నాయకులు మురళి రాజయ్య మురళి PDSU జిల్లా నాయకులు ధన శేఖర్ . తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment