పూర్వ వైభవానికి కృషి చేయండి -బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైభవాన్ని తిరిగి పొందడానికి ప్రతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిబద్ధతతో కృషి చేసి, రాబోయే ఎన్నికలలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించాలని తెలుగుదేశం పార్టీ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గత కొంతకాలం క్రితం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న అధికార వైసిపికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న కాసరం రమేష్ మరియు వజ్రం కిషోర్ లను తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు కార్యనిర్వాహక కార్యదర్శి లుగా నియమిస్తూ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.
తమ అభిమాన నాయకుడు, తెలుగుదేశం పార్టీ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదినోత్సవం నాడు మాకు తెలుగుదేశం పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉన్నదని, అలాగే మాపై నమ్మకంతో మాకు అప్పగించిన బాధ్యతలను త్రికరణశుధ్దితో పూర్తి చేసి, శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ద్వారా రాబోయే ఎన్నికలలో సుధీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, అలాగే మాకు పై బాధ్యతలు అప్పగించిన సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని కాసరం రమేష్ మరియు వజ్రం కిషోర్ లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment