మాతృ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతుల తల్లులకు సన్మానం చేసిన హెల్పింగ్ హాండ్స్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతుల తల్లులకు మాతృ దినోత్సవ సందర్భంగా చిరు సన్మానం చేశారు. జీవితాంతం వారు చేసే సేవలను గుర్తించి వారికి సన్మానము , దుప్పట్లు , పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో సంస్ధ అధినేత మునిర్ బాషా, గరికపాటి రమేష్, బాబా ఫరీద్ మరియు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
మునీర్ భాష మాట్లాడుతూ.... జీవితాంతం ప్రత్యేక ప్రతిభావంతులకు సేవలు చేసే తల్లులే ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళని కొని ఆడారు, వాళ్ళకి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
గరికపాటి రమేష్ మాట్లాడుతూ.... పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ, ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ... మదర్ డే సందర్భంగా ప్రతి తల్లికి శుభాకాంక్షలు తెలిపారు
No comments:
Post a Comment