శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నిత్య అన్నదానం పరిశీలించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం ధర్మకర్తల మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనీ నిత్యాన్నదానం ను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం ధర్మకర్తల మండలి అధ్యక్షులు తారక అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు. నిత్య అన్నదాన మండపానికి వెళ్లి అన్న ప్రసాదాలను తనిఖీలు నిర్వహించారు. భక్తులను నాణ్యత ప్రమాణాలపై అడిగి తెలుసుకున్నారు. నిత్య అన్నదానంలో వినియోగిస్తున్న సరుకులు, కూరగాయలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బందికి తగు సూచనలు చేశారు.అన్న ప్రసాదాల్లో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం తగ్గ రాదని, రుచికరమైన అన్న ప్రసాదం భక్తులకు పెట్టాలని సూచించారు. అన్నప్రసాదాలు వడ్డన లో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి భక్తుడు తృప్తికరంగా భోజనం చేసే విధంగా చేయాలని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ నిత్య అన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలు అందించాలని, తమ జన్మదినాలు ఇతర తమ కుటుంబాల్లో జరిగే సంతోషకరమైన రోజులు లో నిత్య అన్నదానం కు విరాళంగా ఇచ్చి భగవంతుని సేవలో అన్నదానం లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రోజు 5 నుంచి 7 వేల మందికి భోజనం, రాత్రిపూట 2500 మందికి అన్నప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుందని, మరింత నాణ్యమైన అన్నప్రసాదాలు భక్తులకు అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు అన్నదాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment