పేదవారి దేవాలయం నీకు స్మశానమా, నోరు అదుపులో పెట్టుకో చంద్రబాబు - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పేద అక్క చెల్లెమ్మలకు అందజేసిన ఇంటి స్థలాలను స్మశాన వాటికతో పోలిస్తూ కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ఖండిస్తూ ఈరోజు పట్టణ వైయస్సార్ సర్కిల్ వద్ద నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ తాత తండ్రులు ఎవరికైనా మీ పొలాల్లో సమాధులు కట్టారా లేక నీ పొలంలో ఆయన సమాధులు కట్టినావా అసలు మీ తాత తంత్రులు సమాధి కొలతలు ఎంత.పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చడానికి జగనన్న ఎంతో దృఢ సంకల్పంతో ఇచ్చిన స్థలాన్ని సమాధితో పోలుస్తావా. ఈమధ్య ఎక్కువగా సమాధుల గురించి కలవరిస్తున్నావు నాకు తెలిసి ఎన్టీ రామారావు వంద సంవత్సరాల జయంతి సందర్భంగా దగ్గర నీలాంటి నీచుడు భూమి మీద ఉండకూడదని మొరపెట్టుకున్నట్లు ఉన్నారు అందుకే నీ ఆలోచనలన్నీ సమాధుల చుట్టూ తిరుగుతున్నాయి. నీ హయాంలో సగం కట్టి వదిలేసిన టిట్కో ఇల్లు కొలతలు ఎంత జగనన్న ఇచ్చిన ఒక సెంటు కంటే తక్కువే ఆ విషయం మర్చిపోయి పేదవారి మనోభావాలు దెబ్బ చేసే విధంగా మాట్లాడడం సరికాదు.2 ఎకరాల నుండి లక్షల కోట్ల అవినీతి సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్న నీకు పేదవారి ఒక సెంటు సమాధి లాగా కనిపిస్తుందా ?ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దాదాపు 30 లక్షల పైచిలుక పేద అక్క చెల్లెమ్మలకు ఇల్లు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం.నాడు ఎన్టీఆర్ గారికి నేడు ఆంధ్ర రాష్ట్ర అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడుస్తున్న నీచుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్ర అక్క చెల్లెమ్మలను అవమాన పరుస్తూ వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే అక్కచెల్లెమ్మలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూర తారక శ్రీనివాసులు అలాగే బోర్డు మెంబర్లు పసల సుమతి, మున్నా, జై శ్యామ్, గుమ్మడి బాలకృష్ణయ్య,పగడాల రాజు,ఉన్నం వాసు నాయుడు, కోవి చంద్రయ్య నాయుడు,జడ్పిటిసి తిరుమలయ్య,వయ్యాల కృష్ణారెడ్డి, వడ్ల తాంగాల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, నాని,సిరాజ్,గోరా,నజీర్, చింతామణి పాండు,ఫజల్, చిట్టివేలు జయ గోపాల్,పటాన్ ఫరీద్,తిరుకల మల్లికార్జున్ గౌడ్,కంట ఉదయ్ కుమార్, నంద, లక్ష్మీపతి, శ్రీవారి సురేష్, మధు రెడ్డి, కోళ్లూరు హరినాయుడు,mr మురళి యాదవ్,లక్కమనేని కృష్ణ,వల్లం గోపి,పులి రామచంద్ర, సాగిరా బి,కోలూరు జయ,రుసేంద్రమని,ధనలక్ష్మి,భారతి,అస్లామ్,అబ్బు,అంజూర వెంకటేష్ బాబు,పసలా కృష్ణయ్య,గాడి పాకుల కిరణ్,చింతా రాజేంద్ర, జిలాని,యానాదయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment