జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించండి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 30, 2023

జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించండి

 జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించండి





    స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

      రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద పాత్రికేయులు ప్లకార్డులు పట్టి నిరసన తెలిపారు. జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకుని పాత్రికేయులు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ కుటుంబాలనూ, వ్యక్తిగత జీవితాలను సైతం త్యాగం చేసి పాత్రికేయులు స్వచ్చందంగా సమాజహితం కోరి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలకు, పాలక ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్నా తగిన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టడం సహేతుకం కాదన్నారు. పాత్రికేయుల ఉపాధికి, ఆరోగ్యానికి, జీవితాలకు భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చొరవ శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పాత్రికేయులకు ఇంటి స్థలాలు, పట్టాలు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ వృత్తిలో విశేష కృషి చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహక అవార్డులు అందివ్వాలని కోరారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేసి, మీడియా అకాడమిలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అనంతరం ఆర్డీవో రామారావుకు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆర్డీవో అర్హత ఉన్న పాత్రికేయులకు ఎక్కడికక్కడ ఇంటి స్థలాలు కేటాయించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలంటూ సంబంధిత తహశీల్దార్లను ఆదేశించారు. అందుబాటులో ఉన్న ప్రధాన మంత్రి సురక్షా యోజన, జీవన్ జ్యోతి యోజన పథకాలు పాత్రికేయులు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని సూచించారు. తక్కిన సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కామేష్, పాత్రికేయులు ఎంవీ రమణ, రహంతుల్లా, వలిపి శ్రీరాములు, దిలీప్, మెహర్, నత్తం హరి, బత్తెయ్య, బాలచంద్ర, కే. వెంకటేష్, యాసిన్, దనశేఖర్, బాలూ, హకీమ్, జయశ్యామ్, కిషోర్, చాన్ బేగం, లోకనాధం, ఆనంద్, బి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad