మొక్కే కదా అని నరికేస్తే మానవ మనుగడకే ముప్పు : యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, May 29, 2023

మొక్కే కదా అని నరికేస్తే మానవ మనుగడకే ముప్పు : యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్

 మొక్కే కదా అని నరికేస్తే మానవ మనుగడకే  ముప్పు 🌱 యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు 









   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


  యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షులు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు, పౌండర్ డాక్టర్ గానుగపెంట రమేష్ మరియు వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థ  సంయుక్తంగా విద్యార్థిని విద్యార్థులతో కలిసి కమ్యూనిటీ సర్వీస్ లో  8 వ రోజు బాగంగా శ్రీ సత్య సాయి జిల్లా కేతిరెడ్డిపల్లి మరియు అనంతపురం జిల్లా P. కొత్తకోట పూతలపట్టు మండలం సంతూరు గ్రామం శాంతి పురం మండలం కొంగాటం గ్రామం v కోట మండలము చిత్తూరు జిల్లా  పలు చోట్ల ప్రాణవాయువు నిచ్చే మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరం చెట్లను నాటుదాం అంటూ మొక్కే కదా అని పీకెస్తే మన మనుగడకు అంతులేని నష్టం వాటిల్లుతుంది కనుక అందరం మొక్కలు నాటాలని తెలిపారు అలాగే జూన్ 5న ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆరోజు నాటికి 2000 మొక్కలకు పైగా ప్రతిరోజూ సంస్థ సభ్యులు  విద్యార్థిని విద్యార్ధులు మొక్కలు నాటుతారు.అలాగే ఈ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తేజశ్రీ , కావ్య,నితిన్ , మజిధ ,మోహన్ మురళి, జయశ్రీ ,మొగిలేశ్వర్ ,లోకేష్,గోకుల్, నిఖిలేస్వార్ పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad