ఘనంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఊరందూరులోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. మొదట ఆయన తల్లి బొజ్జల బృందమ్మ వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తరువాత బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి రిషిత మొదట జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు వీరికి ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల శేష వస్త్రంతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఊరందూరుకు వెళ్లారు. అక్కడ వందలాది మంది అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను గజమాలలతో సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఆయన ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని వారు కోరుకున్నారు. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాలతో పాటు సత్యవేడు, వెంకటగిరి, తిరుపతి నియోజకవర్గాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఊరందూరులో పండుగ వాతావరణం నెలకొంది.
No comments:
Post a Comment