ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య, ప్రైవేటు కన్నా మెరుగైన సౌకర్యాలు....
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రగతి సంస్థ, తిరుపతి వారి ఆద్వర్యంలో శ్రీకాళహస్తి మండలం లోని ఎల్లంపల్లి యానాది కాలనీ గ్రామంలోని బడి ఈడు పిల్లల తల్లి తండ్రులను కలసి ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లలను చేర్చవలసినదిగా కోరడం జరిగినది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో నాడు నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన తదితర కార్యక్రమాల ద్వారా మెరుగైన విద్యను మరియు మౌళిక సౌకర్యాల కల్పన ప్రభుత్వం కల్పించడం జరుగుతోంది, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తల్లి తండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలొ చేర్చవలేనన్న ఉద్దేశ్యాలతో ప్రగతి సంస్థ ఆద్వర్యంలో శ్రీకాళహస్తి మండలంలోని గ్రామాలలో తల్లి తండ్రులకు అవగాహన కల్పించడం జరుగుచున్నది. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ వనమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు విద్యాభివృద్ది కొరకు ఉచిత బోజనం, బట్టలు, పుస్తకములతో పాటు మౌళిఖ వసతుల కల్పనకు అనేక కార్యక్రమాలను ప్రభుత్వం వారు చేపట్టం జరిగిందని తెలిపారు. ప్రగతి మండల కోఆర్డినేటర్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రగతి సంస్థ ద్వారా మండలం లోని గ్రామాలలో బడికి పోని పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్చడం, బాల కార్మిక వ్యవస్థ మరియు బాల్య వివాహాల వలన కలుగు నష్టాలను గురిచి ప్రజలకు తెలియచేయడం తో పాటు బాలల హక్కుల సాధనకై కృషి చేయుచున్నదని తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు మధుసూదన్, తల్లి తండ్రుల కమిటీ నుండి శివమ్మ, సచివాలయం సిబ్బంది అరుణ, మహేశ్వరి, అంగన్వాడీ సిబ్బంది పొలమ్మ, గ్రామ గ్రామ నాయకులతో పాటు ప్రగతి సిబ్బంది రామచంద్ర పాల్గొన్నారు.
No comments:
Post a Comment