బంగారమ్మ జాతర గరిగె ఉత్సవం లో పాల్గొన్న ధర్మకర్త మండలి అధ్యక్షులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 23, 2023

బంగారమ్మ జాతర గరిగె ఉత్సవం లో పాల్గొన్న ధర్మకర్త మండలి అధ్యక్షులు

 శ్రీ బంగారమ్మ జాతర సందర్భంగ గరిగె ఉత్సవం లో పాల్గొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు







   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి పట్టణంలో పిచ్చాటూర్ రోడ్లులో బంగారమ్మ కాలనీ వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన శ్రీ బంగారమ్మ దేవాలయము జాతర సందర్భంగా గరిగె ఉత్సవం దేవస్థానం నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం గరిగె ఉత్సవంనీ మేళతాళాలు ,డప్పులతో  ఊరేగింపు నిర్వహించారు.శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు  మాట్లాడుతూ శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర క్షేత్రంలో నెలకున్న శ్రీ బంగారమ్మ జాతర సందర్భంగా ఈరోజు గరిగె ఉత్సవంనీ నిర్వహించారు. రేపు శ్రీ బంగారమ్మ జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున బంగారమ్మ తల్లికి ఆడబిడ్డ సాగ్యం  రేపు ఉదయం 9 గంటలకు శ్రీ బంగారమ్మ తల్లి సారె సమర్పించి కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు నా మిత్రుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి  దంపతులతో కలిసి సారె సమర్పించి హాజవుతారని తెలియజేశారు తర్వాత జాతర కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి  పాలక మండలి సభ్యులు,ప్రత్యేక ఆహ్వానితులు మరియు పట్టణ ప్రజలు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలో దక్షిణముగా ఏర్పాటు పడిన శ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారి అంటే పాదము ఈ ప్రాంతం తల్లి జ్ఞాన ప్రసూనాంబిక తల్లి యొక్క పాదము తెలియజేశారు. 30 ఏళ్ల క్రితమే జ్యోతిష్యులు తెలియజేశారని. ఈ ప్రాంతంలో  విస్తారంగా కళాశాలలు విద్యా సంస్థలు శ్రీకాళహస్తి పట్నం ఎంత ఉందో అంత పట్టణం ఇక్కడ ఏర్పడుతుందని ఆరోజుల్లో కేశవరావు అని పండితుడు తెలియజేశారు. ఆ జ్యోతిష్యులు చెప్పిన విధంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని అన్నారు. శ్రీ బంగారమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఏఈఓ లోకేష్ రెడ్డి, సూపర్డెంట్ శ్రీహరి, సబ్ టెంపుల్స్ ఇంచార్జ్ లక్ష్మయ్య, దేవస్థాన సిబ్బంది మునిరాజా, పట్టణ ప్రముఖులు భాస్కర్ రెడ్డి, జగన్నాథం నాయుడు, రాజగోపాల్ రెడ్డి, కప్ప రామాంజనేయులు, ఆలయ పూజారి శ్రీనివాసులు మరియు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad