శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం, బేరివారి మండపం వద్ద ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, సత్యవేడు MLA కోనేటి ఆదిమూలం , టిటిడి బోర్డు మెంబర్ పోకల అశోక్ గారు,MLC బల్లి చక్రవర్తి విన్ టివి చైర్మన్ డా.టి దేవనదాన్ యాదవ్ , శ్రీకాళహస్తి RDO అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, డ్వాక్రా అక్క చెల్లమలు, అధికారులు, తిరుపతి జిల్లాకు చెందిన ZPTC లు, MPP లు, సర్పంచ్ లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు ఇలా ఈరోజు దాదాపు 75 వేల మంది ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే అర్ధనారీశ్వర స్వామి దేవాలయం వద్ద శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో మరియు పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు బోర్డ్ సభ్యులు ఎమ్మెల్యే గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.
అలాగే తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించడానికి విచ్చేసిన దాదాపు 75వేల మందికి భోజన ఏర్పాట్లు చేసి అనంతరం వారితో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే .
No comments:
Post a Comment