శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కి దర్శనానికి విచ్చేసిన ఎండోమెంట్ కమిషనర్ స్వాగతం పలికిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈఓ కేవీ సాగర్ బాబు .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈవో కేవీ సాగర్ బాబు ఆధ్వర్యంలో అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వదించుగా శేష వస్త్రంతోసత్కరించి స్వామి అమ్మ వార్ల తీర్థప్రసాదాలును ఆలయ చైర్మన్ ఈఓ స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ ను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కోరారు.
శ్రీకాళహస్తిశ్వరుని ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ అభివృద్ధి సంబంధించి ఎండోమెంట్ కమిషనర్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు కు భూ సేకరణలో ఏకైక భవనం ఒకటి మాత్రమే మిగిలిపోయిందని, వెంటనే దాన్ని పూర్తి చేసి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. అలాగే దేవస్థానం ఆధ్వర్యంలోని విజ్ఞానగిరి కుమారస్వామి ఆలయం వద్ద నాలుగిల్లు భూసేకరణ చేయాలని, అలాగే గంగమ్మ గుడి ఆధునీకరణకు ఒక ఇల్లు సేకరణ చేసి పనులు చేపట్టాల్సి ఉంది అని వివరించారు. వీటికి పరిహారం మంజూరు చేయాలని కోరారు. శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసెలా సహకారం ఇవ్వాలని కోరారు.
ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ ఆలయ ఇంజనీర్లతో చర్చించి ఆలయ పరిధిలోని అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా ప్రతిపాదనలు ఇవ్వాలని, ఎండోమెంట్ కార్యాలయం నుంచి అనుమతులు ఇస్తామని ఆయా పనులు సత్వరమే నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు,దేవస్థానం ఈవో సాగర్ బాబు, ఏఈఓ సతీష్ మాలిక్, లోకేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఈ ఈ మురళీధర్ రెడ్డి, డిఈ శ్రీనివాస్ రెడ్డి, సూపర్డెంట్ నాగభూషణం, దేవస్థాన ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, వేద పండితులు అర్థగిరి, సంగమేమశాస్త్రి శర్మ, రాజేష్ శర్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment