పచ్చని చెట్లు పెంపకం మానవ మనుగడకు చక్కని చుక్కాని - యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఏర్పేడు మండలం పాతవీరా పురం పంచాయతీ మరియు కాగితాల పురం గ్రామం తొట్టంబెడు మండలం నందు యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షులు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు, వ్యవస్థాపకులు డాక్టర్ గానుగపెంట రమేష్ ల ఆధ్వర్యంలో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం సంయుక్తంగా విద్యార్థిని విద్యార్థులంతా కలిసి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ లో బాగంగా ప్రాణవాయువు నిచ్చే చెట్లను పాత వీరా పురం గ్రామం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ నందు మరియు కాగితాల పురం గ్రామం నందు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని పచ్చని చెట్లు మానవ మనుగడకు చక్కని చుక్కాని అని తెలిపారు. అలాగే ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే దాతలు సంస్థకు మొక్కల కొరకు సహకరించవలసిందిగా సంస్థ ప్రతినిధులు కోరారు జూన్ 5న ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆరోజు నాటికి 2000 మొక్కలకు పైగా ప్రతిరోజూ సంస్థ సభ్యులు మరియు వేము కళాశాల విద్యార్థిని విద్యార్ధులు పాల్గోని జయప్రదం చేస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.బాషా బేధం లేకుండా అందరూ ఈ కార్యక్రమం లో బాగాసములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు K వెంకటముని,K నాదమునీ, K శంకర్, k పండమ్మ ,సాయికుమార్,రామ్ నాయుడు, వంశీ ,ఈశ్వర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యాజమాన్యానికి సేవా సంస్థ సభ్యులకు విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సేవా సంస్థ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు
No comments:
Post a Comment