శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చిన మహిళకు ప్రమాదవశాత్తు బావిలో పడింది పాలకమండలి చైర్మన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అదిలాబాద్ జిల్లా చెందిన సరస్వతి స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన దర్శనం అనంతరం జల వినాయకుడు వద్ద ఉన్న చంద్ర పుష్కరిలో ప్రమాదవశాత్తు జారిపడింది. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు వెంటనే స్థానిక ఏరియా హాస్పిటల్ కి వెళ్లి ప్రమాదం జరిగిన మహిళలను పరామర్శించి ఇటువంటి ప్రాణహాని లేదు అని డాక్టర్ లు తెలియజేశారు.
ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా చెందిన సరస్వతి స్వామి అమ్మవార్ల దర్శనార్థం కోసం రావడం జరిగింది జల వినాయకుడు వద్ద పార్కింగ్ స్థలంలో కార్లు ఎక్కే దానికి ముందురా మూత్ర విసర్జన సమయంలో అక్కడ ఉన్న బావి తెలీక జారిపడింది అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గమనించి వెంటనే అంబులెన్స్ ద్వారా ఏరియా హాస్పిటల్ తరలించారు సరస్వతి కాలు ప్యాక్చర్ అయింది అని గుర్తించి వెంటనే దేవస్థానం అంబులెన్స్ ద్వారా తిరుపతి సంకల్ప హాస్పిటల్ తరలించారు. ఎటువంటి ప్రాణహాని లేదని డాక్టర్లు తెలియజేసినారు. భక్తురాలికి కావలసిన వైద్య సదుపాయం అంతా దేవస్థానం చూస్తుందని తెలియజేశారు. అనంతరం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి తిరుపతి సంకల్ప హాస్పిటల్ తరలించారు. అనంతరం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఇంజినీరింగ్ శాఖ అధికారులకు వెంటనే ఆ బావికి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులకు సూచన చేశారు. తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలతో ఎటువంటి ప్రాణం నష్టం జరగకుండా కాపాడారని తెలియజేశారు
No comments:
Post a Comment