పట్టణం నందు భారతీయ జనతా పార్టీలోనికి వలసల జోరు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు చేరిక
భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖులు ఈరోజు భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారిని కేంద్ర మంత్రి భగ్వవంత్ ఖుబా , రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో విజయవాడలో గల రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ రోజు 11.00 గం.లకు సోము వీర్రాజు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరణంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ, అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నా మనప్రియతమా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు మేము పార్టీలో స్వచ్ఛందంగా కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి సమక్షంలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమై పార్టీగా, దేశ భక్తిని కల్గిన పార్టీగా ఈ సందర్భంగా వారు కొనియాడారు. అందులో చేరడం మా పూర్వజన్మ సుకృతమని అందులకు కృతజ్ఞతతో పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణతో క్రియాశీలకంగా పనిచేస్తామని వెల్లడించారు.
భారతీయ జనతా పార్టీలో చేరిన శ్రీకాళహస్తి పట్టణ ప్రముఖులు
1. ఎస్. వి. రమణ
2. పగడాల ప్రతాప్
3. కలపాటి మోహన్ రావు
4. అంజూరు శరవణ బాబు
5. శ్రీపురం సుధాకర్
6. నండ్ర విద్యాసాగర్
7. చిత్తూరు సుబ్రమణ్యం
8. తిరకాల రాజేష్ గౌడ్ మొదలైన ప్రముఖులు చేరికలు జరిగింది.
No comments:
Post a Comment