బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్భంగా వరసిద్ధి వినాయకుని 44 కొబ్బరికాయలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేటలో (కార్గిల్ సర్కిల్ వద్ద) ఉన్నటువంటి వరసిద్ధి వినాయకుని గుడి వద్ద "బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి" జన్మదినం సందర్భంగా 44 సం"పూర్తి చేసుకున్న నేపథ్యంలో ..., శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి "కాసరం రమేష్", పట్టణ కార్యనిర్వ కార్యదర్శి "వజ్రం కిషోర్" గార్ల ఆధ్వర్యంలో .......,
"సుధీర్ రెడ్డి" జన్మదినం సందర్భంగా వరసిద్ధి వినాయకుని వద్ద బాణాసంచా కాలుస్తూ, నినాదాలతో హోరెత్తిస్తూ, పూజా కార్యక్రమము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించి ఆయనకు ఆయురారోగ్య అష్టఅయిశ్వర్యాలతో, రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననులు పొందుతూ వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని రాబోవు ఎన్నికల్లో శాసనసభ్యుడిగా విజయం సాధించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ...., 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 44 కొబ్బరికాయలతో వరసిద్ధి వినాయకుని వద్ద పొల్ల టెంకాయలు కోటి తమ అభిమానం చాటుకోవడం జరిగింది పై ఈ కార్యక్రమంలో రాష్ట్ర ,జిల్లా ,పట్టణ, ప్రముఖ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
No comments:
Post a Comment