శ్రీకాళహస్తి దేవస్థానంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజి అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానంలో -సంకట చతుర్దశిని పురస్కరించుకొని అంజి అంజి వినాయక స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్ర యుక్తం గా నిర్వహించారు. ప్రతి కుటుంబం గణపతి హోమం నిర్వహించుకునే విధంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం ఆధ్వర్యంలో సంకట చతుర్దశి నాడు గణపతి హోమం ఆర్జిత సేవగా తీసుకొచ్చారు. ప్రతి సంకట చతుర్దశి నాడు అంజి అంజి వినాయక స్వామి వద్ద అనేకమంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలిగే విధంగా ఆర్జిత సేవలో పాల్గొంటున్నారు మంగళవారం సంకట చతుర్దశిని పురస్కరించుకొని ఆలయంలోని అంజి అంజి గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి, గణపతి హోమాన్ని శాస్త్ర యుక్తం గా నిర్వహించారు. అనంతరం గణపతి అభిషేకాన్ని నిర్వహించి, స్వామివారికి విశిష్ట అలంకారం చేశారు. ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం అర్చకులు Smk శ్రీనివాస్ గురుకుల్,, ఆలయ అధికారులు టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, వేద పండితులు హేమంత్ కుమార్ పరిచారకులు గోవిందస్వామి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు ఆలయ అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment