గంగమ్మ తల్లికి సారె సమర్పణ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, May 17, 2023

గంగమ్మ తల్లికి సారె సమర్పణ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు

 బిపి అగ్రహారంలో శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా సారె  సమర్పణ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు 





   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి పట్టణంలో బిపి అగ్రహారంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ  గంగమ్మ తల్లి జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థాన అధికారులు ఆధ్వర్యంలో  శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతుల ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లికి సార సమర్పించారు  ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారుశ్రీ శ్రీ శ్రీ  గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పట్టు వస్త్రాలు శిరస్సుపై ఉంచుకొని ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలోని శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లికి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు  సమర్పించారు.శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం అర్చకులు వెద పండితులు విశేష పూజలు జరిపి పట్టు వస్త్రాలను శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి అమ్మవార్లకు అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి అమ్మవార్లకు జాతర సందర్భంగా  పురస్కరించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. చైర్మన్  మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనలతో గత సంవత్సరం కూడా గంగమ్మ తల్లికి సార సమర్పించడం జరిగింది  రెండవ సంవత్సరం కూడా గంగమ్మ తల్లి కి సార దేవస్థానం తరుపు అందజేశామని తెలియజేశారు ఈ యొక్క సంప్రదాయం కూడా ప్రతి సంవత్సరం ఉండేవిధంగా పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారని అన్నారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ గంగమ్మ తల్లి అమ్మవార్ల పాల్గొనడం అదృష్టం అన్నారు. అమ్మ వార్లు కృప కటాక్షాలు ప్రజలందరికీ లభించాలని అందరూ  సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు*.ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండ సభ్యులు సాధన మున్నా, రమాప్రభ,లక్ష్మి,ప్రత్యేక ఆహ్వానిత బోర్డు సభ్యులు చింతామణి పాండు మరియు పట్టణ ప్రముఖులు రత్నం రెడ్డి, బుజ్జి మేస్త్రి, ఆర్కాట్ శంకర్, కొల్లూరు హరి నాయుడు, లక్ష్మీపతి,భాస్కర్ ముదిరాజ్, స్వామి రెడ్డి భరత్ రెడ్డి, ముని కృష్ణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, పాలమంగాలం రవి, ఆర్కాట్ హేమంత్, కార్తీక్, బాలశెట్టి నర్సింహులు, సుధీర్, సునీల్, ప్రసాద్ శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు ఏఈఓ సతీష్ మాలిక్, దేవస్థాన ప్రధానార్చకులు కరుణాకర్ గురుకుల్, వేద పండితులు హేమంత్ శర్మ, త్రినాధ కళ్యాణ చందు శర్మ, దేవస్థానం సిబ్బంది చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి,కామేశ్వరరావు మరియు దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad