శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా యువ నేస్తం అసోసియేషన్ కార్యక్రమాల కరదీపిక ఆవిష్కరణ: అధ్యక్షులు మునిశేఖర్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపుమధుసూదన్ రెడ్డి గారిని యువ నేస్తం అసోసియేషన్ సభ్యులు కలవడం జరిగిందని యువ నేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మధురాంతకం మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువనేస్తం అసోసియేషన్ వారు కరోనా సమయం నుంచి చేస్తున్న సేవలను మేము గమనిస్తున్నామని, అలాగే గిరిజన కాలనీలలో విద్యాభివృద్ధి కోసం వారు చేస్తున్న సేవలు అభినందనీయమని మరియు ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్ధిక సహాయం అందించడంతో పాటు అవసరం ఉన్నచోట రక్త దానం చేస్తున్నారని కొనియాడారు,ఈ సందర్భంగా మునిశేఖర్ మాట్లాడుతూ సంస్థ 3 వ వార్షికోత్సవం సందర్భంగా, సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు యువనేస్తం అసోసియేషన్ చేసిన కార్యక్రమాలతో కూడిన కరదీపికను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ఇన్చార్జ్ కిషోర్ రెడ్డి, యువ నేస్తం అసోసియేషన్ కార్యదర్శి జస్వంత్, ఉపాధ్యక్షులు హనుమంత్ నాయక్, కోశాధికారి మునెమ్మ, ఏర్పేడు మరియు శ్రీ కాళహస్తి మండల కోఆర్డినేటర్లు అరుణ, నాగమణి,మరియు యువనేస్తం వాలంట్రీలు స్రవంతి, లక్ష్మి మరియు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment