శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కు వెండి ఉరువులు అందజేశారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యులు కీ:శే తీగల కోటేశ్వరరావు గారి కుమారుడు తీగల హేమంత్ కుమార్ గారు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు విలువగల వెండి చెంబు మరియు వెండి శంఖం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు అందజేశారు.వారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో తీగల భాను, వేలూరు రమేష్, చైర్మన్ పిఎ పసుపులేటి కామేశ్వరరావు, మరియు దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment