శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంకు నూతన బోరును ప్రారంభించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణంలో బహుదూరుపేట విశ్వబ్రాహ్మణ వీధిలో వెలసిన జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యాలు కోసం నూతన బోరునీ ప్రారంభించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంకి మంచినీరు కోసం స్థానిక శాసనసభ్యులునీ కలవడం జరిగింది శాసనసభ్యులు గారు సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఈ దేవాలయం పూజలు నిర్వహించి దగ్గర బోర్ పాయింట్ని ఏర్పాటు చేసి బోర్ ఏర్పాటు చేశారు. యావత్ ప్రపంచానికే కాలజ్ఞానం చెప్పిన మహనీయుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈరోజు వచ్చిన సాటిలైట్ సిస్టం కంప్యూటర్ పరిజ్ఞానము కాకుండా కేవలం మూడవకంటితో ద్వారా ప్రపంచాన్నికి అంతా కాలజ్ఞానం ఇచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఈ భవిష్యత్తు ఉంటుందని నిర్దేశించిన మహానాడు కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయముకు బోరు ఏర్పాటు చేయడం మాకందరికీ చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రమణ్యం ఆచారి, వైయస్సార్ సిపి నాయకులు చంద్రరాజు, కొల్లూరు హరి నాయుడు, మరియు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు వెంకటేష్ఆచారి,బాల,బ్రంహయ్య,ఆచారి,బి.చంద్ర,నాగరాజు,శంకర్ ఆచారి,ఆనంద్ ఆచారి, ప్రసాద్ ఆచారి. మరియు స్థానికులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment