శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పర్యవేక్షణ చేపట్టి అంజూరు తారక శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 30, 2023

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పర్యవేక్షణ చేపట్టి అంజూరు తారక శ్రీనివాసులు

 శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పర్యవేక్షణ చేశారు




    స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు  పర్యవేక్షణ చేపట్టి రద్దీని నియంత్రిస్తూ భక్తులకు త్వరగా దర్శనం కల్పించారు.రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంలో భక్త జన సందోహం నెలకొంది.  క్యూ లైన్ లో భక్తులు బారులు తీరడం స్వామి అమ్మ వార్లు దర్శనం అధిక సమయం పట్టే పరిస్థితి ఏర్పడింది. ఓవైపు రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు, మరోవైపు అభిషేకాలకు భక్తులు అధికంగా తరలి రావడంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఉదయం నుంచే ఆలయంలో పర్యవేక్షణ చేపట్టి క్యూ లైన్లను క్రమబద్ధీకరించి సామాన్య భక్తులకు త్వరగా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు తాగునీరు మజ్జిగ పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. అలాగే మండుటెండల్లో క్యూలైన్ లో ఇబ్బంది పడుతున్న చంటి బిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనానికి పంపేలా చైర్మన్ అంజూ రు శ్రీనివాసులు ప్రత్యేక చొరవ చూపారు. మండుటెండకు ఉక్క బోత ఇబ్బంది పడుతున్న చంటి బిడ్డలు తల్లిదండ్రులు చైర్మన్ గుర్తించి దర్శనం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేశారు. అలాగే స్వామి అమ్మవారి ఆలయం వద్ద సామాన్యులకు ఇబ్బంది లేకుండా అందరికీ లఘు దర్శనం కల్పించి దళారీలను నియంత్రించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ త్వరగా దర్శనం చేసుకున్నారు. చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ అధికారులు సమిష్టి కృషి కృషితో విశేషంగా తరలివచ్చిన భక్తులకు సుదర్శనం కల్పించేందుకు తీవ్ర కృషి చేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వామి వారికి ఆలయం వద్ద స్వయంగా క్యూలైన్లో పర్యవేక్షణరు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు మరియు దేవస్థానం సూపర్డెంట్ నాగభూషణం,టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సుదర్శన్ నాయుడు, ఎస్పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad